బాల్ థాకరే వర్సెస్ డీబీ పాటిల్ వర్సెస్ ఛత్రపతి శివాజీ..

Thursday, 24 Jun, 3.06 pm

ముంబై: నవీ ముంబైలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.16 వేల కోట్ల ఖర్చుతో ఆ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. మరో రెండేళ్లలో ఆ విమానాశ్రయం అందుబాటులోకి రానున్నది. కానీ అప్పుడు ఆ ఎయిర్‌పోర్ట్ పేరు కోసం రాజకీయ పార్టీలు మధ్య చిచ్చు మొదలైంది. అతిపెద్ద గ్రీఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌గా నవీ ముంబైలో నిర్మిస్తున్న విమానాశ్రయానికి తమ నాయకుడి పేరు పెట్టాలని శివసేన, బీజేపీ, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీలు వాగ్వాదానికి దిగుతున్నాయి. ఇవాళ సిడ్‌కో ఆఫీసు వద్ద ఆ పార్టీలకు చెందిన వేలాది మంది నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

కొత్త ఎయిర్‌పోర్ట్‌కు తమ పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే పేరు పెట్టాలని శివసేన డిమాండ్ చేస్తున్నది.