కమ్యూనిస్ట్‌గా ఉన్న ఈటల క్యాప్టలిస్ట్‌గా మారారు: కౌశిక్ రెడ్డి

Thursday, 24 Jun, 5.16 pm

కరీంనగర్: ఇళ్లందకుంట మండల కేంద్రంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో పాడి కౌశిక్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్‌గా ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ క్యాప్టలిస్ట్‌గా మారారన్నారు. ఆత్మ రక్షణ కోసం మాత్రమే ఈటల బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను ఆయన కోరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.