హైదరాబాద్‌లో 1.19 లక్షల వాహనాలు సీజ్‌

Friday, 25 Jun, 1.01 am

హైదరాబాద్‌ సిటీ : కరోనా సెకండ్‌ వేవ్‌ నియంత్రణకు ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మే 12 నుంచి జూన్‌ 18 వరకు 38 రోజుల్లో హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధుల్లో 1.19 లక్షల వాహనాలను సీజ్‌ చేశారు. ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో అకారణంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాల్ని సీజ్‌ చేసి జరిమానా విధించారు.

75 శాతం వాహనాలు అప్పగింత

సీజ్‌ చేసిన వాహనాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో జరిమానా చెల్లించి పోలీస్‌స్టేషన్‌లో రశీదు చూపించి వాహనం తిరిగి తీసుకెళ్లాలని పోలీసులు సూచించారు. చాలా వాహనాలను వ్యవధిలోనే తిరిగి ఇచ్చేసినట్లు అధికారులు తెలిపారు.