'బీపీ, షుగర్‌ ఉన్నాయా' అని అడిగి.. ఒకేసారి రెండు వ్యాక్సిన్లు!

Friday, 25 Jun, 1.38 am

హైదరాబాద్ సిటీ/కార్వాన్‌ : మాట్లాడుతూ ఉండగానే ఒకేసారి రెండు టీకాలు వేశారని ఆసిఫ్‌నగర్‌ సీతారాంబాగ్‌కు చెందిన గోపాల్‌ సింగ్‌ (47) ఆందోళన వ్యక్తం చేశారు. శాంతినగర్‌ (విజయనగర్‌ కాలనీ)లోని వెట్‌గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్లో టీకా కోసం సోమవారం పేరు నమోదు చేసుకున్నానని, మెసేజ్‌ రావడంతో మంగళవారం మధ్యాహ్నం 2:40కు కేంద్రానికి వెళ్లి టీకా వేయించుకున్నానని గోపాల్‌సింగ్‌ తెలిపాడు.

మాత్ర తీసుకునేందుకు పక్క కౌంటర్‌కు వెళ్తే, పది నిమిషాల అనంతరం అక్కడున్న నర్సు 'మీకు షుగర్‌, బీపీ ఉన్నాయా' అని అడిగారని, సమాధానం చెబుతుండగానే మళ్లీ టీకా వేశారని గోపాల్‌సింగ్‌ చెబుతున్నారు. వేరే ఏదో ఇంజెక్షన్‌ ఇస్తున్నారేమో అనుకున్నానని, మొదటి కౌంటర్‌లో టీకా వేసుకున్నానని చెప్పడంతో నర్సు కంగారు పడ్డారని వెల్లడించారు.